తెనాలి రైల్వే స్టేషన్ అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల టైముంది. వీపున పది కిలోల బ్యాగులు మోస్తూ, తిరుపతి నుండి రాబోయే నారాయణాద్రి కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు యువకులు. ఇద్దరి డ్రెస్సింగ్ మోడ్రన్‍గా ఉన్నా మొహాల్లో కళ లేదు. జీవితంలో ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉన్నారు. కానీ ఆ దిగులును బయట పెట్టుకోకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా తనే ఓపెన్ అయ్యాడు ఓంకార్. “జరిగిన దాని గురించి బాధ పడకురా తేజా…” అన్నాడు పక్కవాడి భుజం మీద చెయ్యి వేయటానికి ప్రయత్నిస్తూ. “పెళ్లి చూపులనేవి బ్యాచిలర్ జీవితంలో ఒక ఫేజ్. నడవక తప్పని బాటలో దాటక తప్పని స్పీడ్ బ్రేకర్లు. ఆ ఫేజ్ దాటి అన్ని ఆటంకాలు ఎదుర్కొంటే కానీ సంసారం అనే స్వర్గం సాకారం కాదు.” “ఆ విషయం ఎవడాలోచిస్తున్నాడెహె…” ఆ