ఆగంతకుడు

క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను. మెయిన్ గేటే కాక, ముఖద్వారం కూడా తెరచివుండడం ఆశ్చర్యం గొలిపింది. లోపల ప్రవేశించి, జేబులోంచి పెన్ టార్చ్ తీసి వెలిగించాడు.క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను. మెయిన్ గేటే కాక, ముఖద్వారం కూడా తెరచివుండడం ఆశ్చర్యం గొలిపింది. లోపల ప్రవేశించి, జేబులోంచి పెన్ టార్చ్ తీసి వెలిగించాడు.***శీతాకాలం కావడంతో రాత్రి ఎనిమిది గంటలకే వీధులన్నీ నిర్మానుష్యం అయిపోయాయి. నగరపు శివార్లలో అందమైన భవంతులు రెండు ఎదురుబొదురుగా ఉన్నాయి. వాటిలో ఒకటి ఓ టీవీ ఛానల్ ప్రొడ్యూసరుదీ, రెండవది ఓ ప్రముఖ చిత్రకారుడిదీను.సోడియం వేపర్ ల్యాంప్స్ ఆ ప్రాంతాన్ని పసుపురంగు వెలుతురుతో నింపేస్తున్నాయి. వాటి నీడలలో జాగ్రత్తగా నడుస్తూ ఆ భవంతులను సమీపించాడు ఓ వ్యక్తి. మనిషి పొడగరి, మీడియం బిల్టూను. వోవర్ కోటు, క్యాపూ ధరించాడు. చేతులకు గ్లవ్స్ ఉన్నాయి. ఎన్నో రోజులుగా తిండిలేనివాడిలా ముఖం పీక్కుపోయి