ఇంటిదొంగలు

  • 156

ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసెఫ్ లు మేనేజర్ గున్నారెడ్డి ఎదుట దోషుల్లా నిలుచున్నారు. గతదినం తాను ఛార్జ్ తీసుకున్న మొత్తం సొమ్ము…ఏ ఎ.టి.ఎమ్. లో ఎంత లోడ్ చేసాడో…బ్యాలెన్స్ ఎంత వుండాలో – వేసిన లెక్కలే వేస్తూ బుర్ర పగులగొట్టుకుంటున్నాడు ఏడుకొండలు. “మీకు ఇరవయ్ నాలుగు గంటల వ్యవధి ఇస్తున్నాను. రేపు ఈపాటికల్లా సొమ్ము తెచ్చి జమకట్టకపోతే, విషయం ఎమ్డీగారి వరకూ వెళుతుంది. ఆయనకు తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా? మీ ఉద్యోగాలు ఊడడమే కాదు, మీరంతా జెయిలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం…” అంటూ తీవ్రంగా హెచ్చరించాడు మేనేజర్…జంటనగరాలలోని బ్యాంక్స్ యొక్క ఎ.టి.ఎమ్స్. లో క్యాష్ లోడ్ చేసే కంపెనీ, ‘ఎక్స్-వై-జెడ్ కరెన్సీ’ లో ఆ ఉదయం గొప్ప కలకలం రేగింది. అందుక్కారణం – పది లక్షల క్యాష్ మిస్ అవుతోంది. ముందురోజున ఎ.టి.ఎమ్స్. లో  క్యాష్ లోడ్ చేసిన ఎగ్జిక్యూటివ్ సాయంత్రం పని ముగించుకుని కంపెనీకి తిరిగిరాగానే