కిల్లర్

  • 243
  • 72

అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన్ రోడ్ కి దూరంగా ఉండడంతో పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఓసారి బిల్డింగ్ చుట్టూ తిరిగొచ్చి మెయిన్ గేట్ ని చేరుకున్నాను. ఇనుపగేట్ పైకెక్కి లోపలికి దిగాను. సెక్యూరిటీ లాడ్జ్ లోపల కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు వాచ్ మేన్. మెల్లగా తట్టిలేపాను. ఉలికిపడి లేచి, ‘కౌన్ హై?’ అన్నాడు. మాట్లాడకుండా పిస్టల్ బట్ తో తలపైన కొట్టాను. తల వాల్చేసాడు.          గెస్ట్ హౌస్ ముఖద్వారానికి టూ-వే లాక్ ఉంది. పిస్టల్ ని కీహోల్ లో పెట్టి షూట్ చేసాను. సైలెన్సర్ అమర్చబడియున్నందున్న శబ్దం రాలేదు. తాళం తెరచుకుంది..         లోపల పెద్ద హాలు, రెండు గదులు, కిచెను, మేడపైకి మెట్లూ ఉన్నాయి. హాల్లో డిమ్ లైట్ వెలుగుతోంది. ఓ గదికి బైట గెడపెట్టి వుంటే, రెండవది దగ్గరగా మూసివుంది. ఆ గది దగ్గరకు వెళ్ళి తలుపు తెరచి చూసాను. పనివాళ్ళు కాబోలు