మరణచిత్రం ఏ నిమిషానికి ఏమి జరుగునో?

చెత్త ఏరుకునే ఇద్దరు కుర్రాళ్ళు ఆ బాక్సుల చుట్టూ తిరిగి చూస్తున్నారు. ఒక బాక్సులోంచి కొయ్యబారిన చెయ్యి ఒకటి బయట వేలాడుతోంది. భయంతో అరుస్తూ పరుగుతీశారు. పోలీసు లొచ్చారు. డంప్‌యార్డ్‌లో రెండు బాక్సుల్లో రెండు అర్ధనగ్న శవాలు. ఒక శవం చిత్రకారిణి హేమది, రెండో శవం ఆమె లాయర్‌ హరీష్‌ది... ముందు రోజే వీళ్ళిద్దరి మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి.ముంబయి చిత్రకళా ప్రపంచం హాహాకారాలు చేసింది ఈ అకృత్యానికి...ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ దాల్వీ కాండివిలీలోని లాల్జీపద బయల్దేరాడు. ఇంకోవైపు ఇక్కడికి దూరంగా వారణాసి రైల్వే స్టేషన్‌ దగ్గర, అనుమానాస్పదంగా కన్పిస్తున్న ఒకణ్ణి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఎస్పీ అమిత్‌ పాఠక్‌ పట్టేసుకున్నాడు. వాడి దగ్గర ఏటీఎం కార్డులు, సిమ్‌ కార్డులు చూసి, ‘‘ఎక్కడివిరా ఇవీ?’’ అని రెండు పీకాడు.ఇన్‌స్పెక్టర్‌ దాల్వీ లాల్జీపద చేరుకుని ఒక ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ దగ్గర ఆగాడు. యూనిట్‌ తాళం వేసి వుంది. శవాలు దొరికిన కార్డు బోర్డు బాక్సుల మీద