మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో చాలా మాట్లాడారు.ఒక వైపు టెర్రరిస్ట్స్ అటాక్స్ ఎలాగైనా ఆపాలి, మరోవైపు ఆర్మీ లో ఈ Scam. అందులో మొదటిది ఎంతో ముఖ్యమైంది అని నాకు బాగా తెలుసు. . హైదరాబాద్ లో కచ్చితంగా హేమంత్ సార్ ఉండాలి. అందుకే నేనే రష్యా వెళ్ళాలి అనుకున్న. నా పని కేవలం అక్కడికి వెళ్లి ఎవరికీ తెలియకుండా ఫొటోస్ తీయడం మాత్రమే అని మరి మరి చెప్పారు సార్.సార్ కి నన్ను ఒక్కదాన్నే పంపించడం అస్సలు ఇష్టం లేదు కానీ ఇంకోదారి లేదు అని మాకు బాగా తెలుసు. నేను ఈ పని చేయగలను అని చాలా గట్టిగా నమ్మారు. "ఒకరు మనల్ని అంతగా నమ్మితే ఆ నమ్మకం కోసం ఎంత కష్టమైనా,ఎంత దూరం వెళ్లైనా ఆ పనిని సాధించాలి అనిపిస్తుంది. అందుకే నాకు ఆ పని పెద్ద కష్టం అనిపించలేదు".ఒక్కసారి మేము సాక్ష్యాలు సంపాదిస్తే తరువాత ఏమి చేయాలో సార్ కి బాగా తెలుసు. అందుకే ఎప్పుడు తొందర పడలేదు. నేను రష్యా వచ్చిన