సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airport నుంచి ఫాలో చేస్తూ ఉంటారు.హేమంత్ సార్ మరణ వార్త తెలియని సూర్య, హేమంత్ సార్ చెప్పిన ఆ సాటిలైట్ ఫోన్ కి ఫోన్ చేస్తుంది.సూర్య చేసిన కాల్ సుభాష్ మాట్లాడుతాడు. సూర్య కాల్ చేస్తుంది అని సుభాష్ కి ముందుగానే తెలుసు.సుభాష్ మాటలు వినగానే, హేమంత్ సార్ కాదు అని తేలుస్తుంది సూర్యకి. కానీ నేను సుభాష్ ని, హేమంత్ సార్ మీతో మాట్లాడమన్నారు అంటాడు సుభాష్ .హేమంత్ సార్ మాట్లాడకపోయే సరికి సూర్య కి అనుమానం వచ్చి కాల్ కట్ చేస్తుంది.కానీ హేమంత్ సార్ ముందే చెప్తాడు సుభాష్ గురించి కూడా, అందుకనే మళ్లీ ఫోన్ చేస్తుంది సూర్య : హేమంత్ సార్ ఎక్కడ? సార్ కి ఏమైంది?సుభాష్: సార్ ని నిన్న టెర్రరిస్ట్స్ తో జరిగిన పోరులో చనిపోయారు.అది విన్న సూర్య కొంచెం షాక్ కి గురి అవుతుంది, కానీ వెంటనే కోలుకొని.సూర్య: టెర్రరిస్ట్స్ ఆ ?? లేదా