“సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బెదిరించేస్తే అబ్బాయి అమ్మాయిని ముట్టుకోవడానికే భయపడిపోతాడు. ఇంక ఆపండి” ఒక పెద్దావిడ విసుక్కుంది. మీ టూ... “మొదటిరాత్రే ఆ అమ్మాయిని భయపెట్టేయకురా అని నీకు ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం. విన్నావా? భార్యాభర్తలన్న మాటేగానీ అసలు మీ ఇద్దరి మధ్యనా ఏం పరిచయం ఉదని? నెమ్మదిగా ఆ మాటా ఈ మాటా మాట్లాడి, దగ్గిరతనాన్ని పెంచుకోవాలి. నీ మీద నమ్మకాన్ని కలిగించాలి. ఆ తరువాత నువ్వు ఏం చేసినా కాదననలేని స్థితికి చేరుకుంటుంది. చదువుకున్న వాడివి నువ్వు కూడా ఇలా మొరటుగా ప్రవర్తిస్తావనుకోలేదు” ప్రహ్లాద్‍కి చీవాట్లు పెడుతూ అన్నారు స్నేహితులు. “మరేం ఫరవాలేదులే. ఇవాళైనా కనీసం తొందరపడకుండా ఆమెతో మనసు విప్పి మాట్లాడు. ఒకరినొకరూ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తరువాతే శృంగారానికి ప్రయత్నించు” అంటూ హితబోధలు చేసారు.ప్రహ్లాద్ వాళ్ళ మాటలకి సమాధానం చెప్పకుండా అతడి