ల‌క్ష్మ‌ణుడు...

  • 927
  • 303

ల‌క్ష్మ‌ణుడుFirst Time devotional గా రాశాను.....Telugu Devotional StoriesDevotional Story🫶🫶🫶🫶🫶అన్న‌ద‌మ్ములంటే క‌లిసి మెలిసి ఉండాలి. అలా అని చెప్ప‌డానికి 'రామ‌ల‌క్ష్మ‌ణుల్లా ఉండాలి!' అని పెద్ద‌లు చెప్ప‌డం వింటూ ఉంటాం. రాముడు-ల‌క్ష్మ‌ణుడు రెండు పేర్లూ విడిగాక‌న్నా ఏక‌నామంగా 'రామ‌ల‌క్ష్మ‌ణులుగానే' ప్ర‌సిద్ధం! ఒక త‌ల్లి క‌డుపున పుట్ట‌కపోయినా క‌వ‌ల పిల్ల‌ల్లా పిల్ల‌ల‌ప్పుడే కాదు, పెద్ద‌ప్పుడూ పెన‌వేసుకుపోయిన ర‌క్త‌సంబంధం వారిది!అన్న‌ద‌మ్ములంటే క‌లిసి మెలిసి ఉండాలి. అలా అని చెప్ప‌డానికి 'రామ‌ల‌క్ష్మ‌ణుల్లా ఉండాలి!' అని పెద్ద‌లు చెప్ప‌డం వింటూ ఉంటాం. రాముడు-ల‌క్ష్మ‌ణుడు రెండు పేర్లూ విడిగాక‌న్నా ఏక‌నామంగా 'రామ‌ల‌క్ష్మ‌ణులుగానే' ప్ర‌సిద్ధం! ఒక త‌ల్లి క‌డుపున పుట్ట‌కపోయినా క‌వ‌ల పిల్ల‌ల్లా పిల్ల‌ల‌ప్పుడే కాదు, పెద్ద‌ప్పుడూ పెన‌వేసుకుపోయిన ర‌క్త‌సంబంధం వారిది! అన్న‌ను తండ్రిగా, గురువుగా, దైవంగా భావించాడు ల‌క్ష్మ‌ణుడు. అందుకే యాగ ర‌క్ష‌ణ‌కు విశ్వామిత్రుని వెంట రామునితోపాటు ల‌క్ష్మ‌ణుడూ వెళ్లాడు. విలువిద్య‌లు నేర్చుకున్నా- తాట‌కిని సుబాహుణ్ణి సంహ‌రించి య‌జ్ఞాన్ని కాపాడినా – అటు పిమ్మ‌ట మిథిల‌కు వెళ్లినా రామునితోనే ల‌క్ష్మ‌ణుడు.