ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర థాంక్ యూ చిట్టిరాణి. సుస్మిత అంది ఆనందం నిండిన మొహంతో. నాకు థాంక్స్ ఎందుకు చెప్తావు? నిన్ను నిజంగానే దెయ్యంలా పీడించుకు తిన్నాను కదా. సుస్మితని కౌగలించుకుని తన కుడిబుగ్గ మీద ముద్దు పెట్టుకుంది చిట్టిరాణి. ఒక్క విషయం నాకు అర్ధం కావడం లేదు. ఆ రోజు అలా ప్రవాహంలోకి పడిపోయాక నువ్వెలా ప్రాణాలతో బయటపడ్డావు? అయోమయంగా అడిగాడు మదన్. చెప్తాను విను. చిట్టిరాణి చెప్పడం మొదలు పెట్టింది. నీళ్లలో పడిపోగానే షాక్ తో నిండిపోయింది చిట్టిరాణి మనసు. ఇంక అలా నీళ్ళల్లో కొట్టుకుపోవడానికి ముందుగా చిట్టిరాణి చూసిందేమిటంటే మదన్ వేగంగా వంతెన మీద నుండి వెళ్లిపోవడం. తన మీద ప్రేమ లేకపోయినా, తనని ఏ భావం లేకుండా అంత నిర్దయగా మదన్ వదిలేయడం చాలా బాధాకరంగా అనిపించింది చిట్టిరాణి