ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "నేనిప్పుడే ఫోన్ చేద్దామనుకుంటున్నాను, నువ్వే వచ్చావు." శేషేంద్రని అప్పుడు అక్కడ చూస్తూ ఉంటే చాలా భయం మొదలైంది మాధురిలో. "అన్నీ సర్దేసుకుని, ఇంక బయలుదేరే సమయంలో నాకు చెప్దామనుకున్నావా?" వెటకారంగా అడిగాడు శేషేంద్ర. "లేదు గురూ. ఇంటికి వెళ్ళాక అక్కడనుండి ఫోన్ చేసి చెపుదామనుకుని ఉంటుంది." నవ్వుతూ అన్నాడు కూడా వచ్చిన ఇద్దరిలో ఒకడు. వాళ్లిద్దరూ బలంగా దిట్టంగా, శేషేంద్రలాగే వున్నారు కానీ వాళ్లెవరో మాధురి కి తెలీదు. వాళ్ళనెప్పుడూ ఇంతకూ ముందు తను చూడలేదు. "ఎంత నటించావ్! అది అక్కడే ఉందని తెలిసి కూడా నాకెప్పుడూ చెప్పలేదు. అది అక్కడ ఉందని అదే ఫోన్ చేసి చెప్తే తప్ప నాకు తెలీలేదు." క్రూరమైన చిరునవ్వుతో అన్నాడు మదన్. "నిజం చెప్తున్నా. తనక్కడ ఉందని సుస్మిత ఫోన్ చేసి చెప్పేవరకూ నాక్కూడా