ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

  • 387
  • 174

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "పెళ్లిచేసుకోబోయే అమ్మాయిలో ఉండాల్సిన ఉత్సాహం, చురుకుతనం ఆ అమ్మాయిలో కనిపించడం లేదు." మంగవేణి అంది. "ఆ అమ్మాయి ప్రాబ్లెమ్ నీకు చెప్పాను కదా మామ్, అది సాల్వ్ అయ్యేవరకూ తను అలాగే ఉంటుంది." భోజనం చేస్తూ అంది తనూజ. "ఏం ప్రాబ్లమో ఏమిటో. అది సాల్వ్ చెయ్యడం నీవల్ల అవుతుంది అన్న నమ్మకం మాత్రం నాకు కలగడం లేదు. ఎవరైనా ఇంకో పెద్ద సైకాలజిస్ట్ కి తనని చూపించడం మంచిదేమో." మంగవేణి అంది. ఆ మాట వింటూనే నవ్వింది వనజ. "నువ్వైనా నన్ను నమ్మమ్మా ప్లీజ్." కోపంగా అంది తనూజ. "నిన్ను నమ్మటం మాట ఆలా వుంచు. మీరంతా ఏమనుకున్నా నేను ఒక్క మాట చెప్పదలచుకున్నాను. ఇది మీరంతా అనుకుంటున్నట్టుగా ఎదో మానసిక సమస్య అనిపించడం లేదు. ఇప్పటికి ఇంకా ఆ