తొలి రాత్రి

అది ఒక నిజం. అందమైన నిజం. సంవత్సరాలుగా కలలు కన్న కళ్ళకు, జీవితం మరో కొత్త కోణం లో చూపించే నిజమైన రాత్రి. అందరికీ ఉన్నట్టే సాత్వి కి కూడా కొన్ని కలలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు రెడీ చేస్తుంటే ఎలా సిగ్గుపడాలో తెలియక మురిసిపోతుంది. నవీన్ పేరు తలుచుకున్నప్పుడల్లా బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి తనకి, అలా తనని చూసినప్పుడల్లా పక్కన ఉన్న అమ్మ, అక్క, అప్పుడే ఇంటర్ చదువుతున్న పెదనాన్న కూతురు మహిత కు కూడా నవ్వొస్తోంది. కాసేపు నవ్వాపుకున్నారు గాని , ఇక వాళ్ళ వల్ల కాక ఆటపట్టించడం మొదలుపెట్టారు.వాళ్ళు ఏం మాట్లాడినా గుండె ఝల్ మని మోగుతోంది. గుండెల్లో రక్తం వేడిగా పారుతోంది. ఏంటో తెలియట్లేదు , ఆ రోజు గురించి సాత్వి ఏవో ఏవో ఊహించుకుంటోంది. ప్రతి కల ఏదో ఒక రోజు నిజమవ్వాలి కదా , తన పరిస్థితి కూడా అంతే.కాని, స్వాతి మనస్సులో