ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 17

  • 306
  • 138

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "నేను ఈ స్ప్లిట్ పర్సనాలిటీ, ఇంకా మల్టిపుల్ పర్సనాలిటీలగురించి కొంచెం విన్నాను. కానీ నాలో స్ప్లిట్ పెర్సనాలిటీ డెవలప్ అవుతూందని నీకెందుకు అనిపించింది?" భృకుటి ముడేసి ఆశ్చర్యంగా అడిగింది సుస్మిత. "ఈ రోజు నువ్వు వూళ్ళో ఎక్కడెక్కడికి వెళ్ళావో కొంచెం ఆలోచించుకుని చెప్పు." తనూజ అంది. కిందపెదవిని పలువరసల మధ్య బిగించి దీర్ఘంగా ఆలోచనలో ఆగిపోయింది. "ఏమో నాకు గుర్తుకు రావడం లేదు." కాస్సేపటితరువాత పెదవిని రిలీజ్ చేస్తూ అంది. "నువ్వు మొదట తోటలో ఆ రోజు చిట్టిరాణి ని చూసాననుకున్న చోటికి వెళ్లవు. తరువాత దారిలో చిట్టిరాణి ఇంట్లోకి  వెళ్ళావు." తనూజ అంది. "నేను అక్కడే వుండి గమనించాను. నువ్వు పదినిమిషాలు అలాగా చిట్టిరాణి ఇంట్లో వున్నావు. తోటలోను, ఇంక చిట్టిరాణి ఇంట్లో కి వెళ్తూ వుండగానూ కూడా నిన్ను