ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 14

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "నన్నేదో కౌగలించుకుని, ముద్దులుపెట్టుకుంటే నేను నిన్ను ప్రేమిస్తాననుకుంటే చాల పెద్ద పొరపాటు ఆలోచనతో వున్నావు. నువ్వు గ్రహించలేకపోయినా నీకు నాకు వున్నతేడా నాకు తెలుసు. నేనెప్పటికీ నిన్ను ప్రేమించే ప్రసక్తే లేదు." ఈ రోజు పొలంలో మళ్ళీ తనదగ్గరకి వచ్చిన తనూజతో మొహమ్మాటం లేకుండా చెప్పేసాడు. తనలా చెప్పాక ఇంక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. కానీ ఆ తరువాత నుంచి మనస్సంతా అదొకలా అయిపొయింది. తనెంత మూర్ఖుడు కాకపోతే అలాంటి అందమైన అమ్మాయి ప్రేమించానని వస్తే కాదంటాడు? అలా తిరిగి వెళ్లిపోయిందంటే ఎంత హర్ట్ అయివుంటుందో? మళ్ళీ అసలు తనతో మాట్లాడే ప్రయత్నమైనా చేస్తుందో లేదో? తనని గట్టిగా కౌగిలిలో బిగించిన తరువాత ఆ యవ్వనపు స్పర్శ, తన బుగ్గలమీద పెదాల మీద ఆ సుతిమెత్తటి పెదాల స్పర్శ ఎంత