ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 12

  • 951
  • 483

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "నన్ను మాత్రం అటువైపుగా వెళ్లనివ్వడం లేదు. నువ్వు మాత్రం అక్కడ బాగానే ఎంజాయ్ చేసి వచ్చావా?" సుస్మిత తో కోపంగా అన్నాడు మదన్. ఇంటికి వస్తూనే సుస్మిత, తనూజ ఇద్దరూ మదన్ గదిలోకి వెళ్లారు. తనూజ బెడ్ మీద మదన్ పక్కనే కూలబడితే, సుస్మిత ఎదురుగుండా వున్న కుర్చీలో కూచుంది. "ఐ యాం సారీ. నేనక్కడ ఎంజాయ్ చెయ్యలేదని చెప్పను. నిజంగా మీ ఫామ్ హౌస్ చాలా బాగుంది." సుస్మిత అంది విచార వదనంతో. "కానీ నువ్వూ మళ్ళీ అక్కడికి వెళ్లే అవకాశం వచ్చేవరకూ నేనూ అటువైపు వెళ్ళను." "అంటే ఆ తోటలో చిట్టిరాణి దెయ్యం ఉందన్న భ్రమ నీలో ఇంకా అలాగే ఉందన్నమాట." చిరాగ్గా అన్నాడు మదన్. "నీకెన్ని సార్లు చెప్పాలి నాది భ్రమ కాదు నిజం అని." కోపంగా