ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 10

  • 363
  • 132

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "నేను నీ గురించే పొలాలనన్నీ వెదుక్కుంటూ ఇక్కడివరకూ వచ్చాను. నువ్వెక్కడా కనిపించలేదు. ఫామ్ హౌస్ లో వున్నావేమోనని అక్కడికి వెళదామనుకుంటూ ఉంటే నువ్వు నా వెంకాతలే వున్నావు." ఎందుకో తెలీలేదు బుగ్గలు రెండూ సిగ్గుతో కందిపోయాయి తనూజకి. అచ్చం తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వున్నాడు వంశీ. ఏపుగా కండలు తిరిగిన శరీరంతో, నల్లటి వత్తైన జుట్టుతో వున్నాడు. కాకపోతే పల్లెటూరివాళ్లలాగా గడ్డం, మీసాలు మాత్రం పెంచలేదు. నున్నగా షేవింగ్ చేసుకుని వున్న ఆ బుగ్గల్ని ఒకసారి ముట్టుకుని చూస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది తనూజకి. అలా ధృడంగా వున్న ఆ శరీరంతో వంశీ తనని ఒకసారి బలంగా కౌగలించుకుంటే ఎలావుంటుంది అన్న ఇంకో ఆలోచన వచ్చి శరీరం అంతా ఎదో తెలియని ధ్రిల్ తో నిండిపోయింది. తను పది