ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 9

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర అప్పుడు వంశీకి పద్నాలుగు సంవత్సరాల వయస్సు. తనూజకి పదేళ్లు వుంటాయేమో. ఆ రోజు తను ఫామ్ హౌస్ లో ఎదో సర్దుతూ ఉంటే అక్కడకి వచ్చింది. "మీ మామ్ నీ చిన్నప్పుడే చనిపోయింది. నీకు మా బావ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఎదో వాళ్ళకి స్వంత మనిషిలా బాగానే మేనేజ్ అయిపోతున్నావు" అంది. "నేనేం ఊరికినే పడి తినడం లేదు. బోలెడంత చాకిరీ చేస్తున్నాను." కోపంగా అన్నాడు వంశీ. "చాల్లే. ఎదో నెలకి ఇంత జీతం పడేస్తే ఒళ్ళు వంచి పనిచేసే పనివాళ్ళు బోలెడంత మంది దొరుకుతారు. ఈమాత్రం  దానికి ఇంట్లో పెట్టుకుని స్వంత మనిషిలా చూసుకోవడం అనవసరం." మళ్ళీ అంది. "అయితే ఆ విషయం వెళ్లి మీ అక్కకి, బావకి చెప్పు. వాళ్ళు వెళ్లిపొమ్మంటే నేను వెళ్ళిపోతాను.