ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 8

  • 585
  • 258

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర తను కూడా కుర్చీలోనుండి లేచి మదన్ పక్కన కూచున్నాక అంది తనూజ. "సారీ బావా. నీకు తెలుసుకదా నా వీక్నెస్. ఒక్కోసారి ఎదుట వాళ్ళ ఫీలింగ్ గురించి ఇంత కూడా ఆలోచించకుండా మాట్లాడేస్తాను. ఐ యాం రియల్లీ సారీ." తనూజ తన కుడిభుజం మీద చెయ్యి వెయ్యగానే కళ్ళు తెరిచి ఆమె మొహంలోకి చూసాడు మదన్. "నువ్వు ఫోన్ లో తను సైకాలాజికల్ గా డిస్టర్బ్ అయింది నా హెల్ప్ కావాల్సి ఉంటుంది అని మాత్రమే చెప్పావు. నిజంగా నా హెల్ప్ పూర్తిగా కావాల్సి ఉంటే నాకు మొదటినుండి పూర్తి విషయాలు తెలియాలి." తన భుజం మీద నుండి తనూజ చెయ్యి తొలగించి, బెడ్ మీద అడ్జస్ట్ అయి స్ట్రెయిట్ గా కూచున్నాడు. సుస్మిత తన ఇంటికి వచ్చిన దగ్గరనుండి మొదలు