నిరుపమ - 21

  • 225
  • 99

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "ఆల్రైట్" తలూపింది మేనక. "నిరంజన్ ఇక్కడ సెటిల్ అవడం మీ ఆయనగారికి ఇష్టమేనా?" మళ్ళీ అదే మంద్ర స్వరంతో నిర్మల మొహంలోకి చూస్తూ అడిగింది. "అవును" "మీరింకేమి మాట్లాడుకున్నారు?" "తనని ఈ ఊళ్ళోంచి వెళ్లిపొమ్మని చాలా గట్టిగా చెప్పాను." నిర్మల చెప్పింది మామూలు గొంతుతో. 'ఎందుకలా చెప్పారు' అని అడగబోయి ఆగిపోయింది మేనక. ఆలా స్ట్రెయిట్ గా అడిగితే ఆ  ప్రశ్నకి సమాధానం రాకపోచ్చనిపించింది. "దానికి నిరంజన్ గారు ఏమన్నారు?" "నేనెందుకు వెళ్ళాలి? రంగనాథ్ కూడా ఈ వూళ్ళో సెటిల్ అవ్వమంటేనే నేనిక్కడ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాను’. అన్నాడు." "దానికి మీరేమన్నారు?" "రంగనాథ్ కి ఏమి తెలియదు కాబట్టి రమ్మన్నాడు. రంగనాథ్ కి, నిరుపమ కి విషయం తెలిసిపోతే’. అన్నాను." అక్కడ వాతావరణం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపొయింది. రంగనాథ్ చెవులు రిక్కించుకుని వింటున్నాడు. "దానికి