నిరుపమ - 18

  • 729
  • 351

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "నాకర్ధం అవుతూందిరా." వాడికి కుర్చీ దగ్గరగా లాక్కుని మరోసారి వాడి కుడి భుజం మీద చెయ్యి వేసి అంది మేనక.  "కానీ మనం ఫాక్ట్స్ యాక్సప్ట్ చేసే తీరాలి. వేరే దారి లేదు." "ఐ నో ఇట్ అక్కా." కన్నీళ్లు తుడుచుకున్నాడు ఆనంద్ . " తనెందుకు సైకాలజీ చదవాలనుకుందో నాకు తెలియదు. కానీ తను మాథ్స్ లో జీనియస్. నాకు మాథ్స్ లో వచ్చే డౌట్స్ అన్ని యిట్టె సాల్వ్ చేసిపెట్టేది. నాకెలా చదువుకోవాలో, ఎలా జ్ఞాపకం వుంచుకోవాలో ఎన్నో ట్రిక్స్ చెప్పేది. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూనే ఉండేది. ఏరోజూ తను ఏ విషయం గురించి బాధపడుతున్నట్టుగా అనిపించలేదు.  నేను తను సూసైడ్ చేసుకుందని తెలిసిన రోజు షాక్ తో స్పృహ తప్పిపోయాను. చాలా రోజులు మామూలు మనిషిని కాలేక పోయాను." "అంతగా ఎఫెక్ట్ అయ్యావా?"