నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "అప్పుడు కూడా మా ఆయనకి వేరే వూరు ట్రాన్స్ఫర్ అయితే, నా కాలేజీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వక తప్పదు కదా. ఈ మాటలు వద్దమ్మా. ఆలా కాలేజీ ట్రాన్స్ఫర్ ఇబ్బందులు వస్తే ఆ బాధలు నేను పడతాను. నేను కాలేజీ లో జాయిన్ అవ్వడానికి నువ్వు అంగీకరిస్తేనే పెళ్లి గురించి ఆలోచిస్తాను." మొండిగా అంది మేనక. "ఒకే అయితే." ఇలా కాంప్రమైజ్ అవ్వక తప్పదని చాలా రోజులుగా అనుకుంటూంది వనజ. " నువ్వు కాలేజీలో జాయిన్ అవ్వు. కానీ మంచి సంబంధం కుదిరితే నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి." "ప్రొవైడింగ్, నాకు నచ్చిన కుర్రాడు అయితేనే." "నీకు నచ్చకుండా ఎవరో ఒకరిని ఇచ్చి చేసేడానికి నేనేం రాక్షసిని కాదు." నవ్వింది ప్రతిమ. "కానీ నీకు నీ కలల రాజ కుమారుడే కావాలంటే నేను తేలేను." "నాకు కలల