నిరుపమ - 12

  • 951
  • 432

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "ఒక్క విషయం నీకేమి ఆడ్ గా అనిపించలేదా?" నిరుపమ ఇంటికి ఆటోలో వెళుతూ ఉంటే తోవలో సమీర మొహంలోకి చూస్తూ అడిగింది మేనక. "ఆ విషయం ఏంటో చెప్పకుండా నువ్విలా అడగడం ఏమి బాగాలేదు." "ఆ నిరంజన్ ఆ అవుట్ అఫ్ ఫాషన్ బ్లాక్ స్పెక్ట్స్ ఎందుకు పెట్టుకున్నాడు? అదర్ దేన్ దట్ హి ఈజ్ ఇంప్రెసివ్." "అఫ్ కోర్స్, ఎస్." నవ్వుతూ తలూపింది సమీర. "ఒకేసారి నిరుపమ అడిగేసింది కూడా. తన ఐస్ కి ఎదో పెక్యూలియార్ ప్రాబ్లెమ్ ఉందంట.  తన ఐస్ ఏమాత్రం లైట్ కి, పొల్లూటెడ్ ఎయిర్ కి ఎక్సపోజ్ అవ్వకూడదట. అందుకని డాక్టర్స్ సజెస్ట్ చేశారట. నిజానికి తనకి కూడా ఆ బ్లాక్ స్పెక్ట్స్ అలా పెట్టుకోవడం ఇష్టంలేదని అన్నాడు." "ఆల్రైట్. మనకి ఇష్టం లేనివి కూడా తప్పక కొన్నిసార్లు చెయ్యాల్సివస్తూ