నిరుపమ - 6

  • 894
  • 483

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "అయితే తన మీద" తన రెండు మోచేతులు మధ్యలో వున్నబల్ల మీద బాలన్స్ చేసుకుని, స్మరన్ మొహంలోకి చూసింది  మేనక. "రేప్ కానీ గ్యాంగ్ రేప్ కానీ జరిగి ఉండొచ్చా? అంతకన్నా పెద్ద కంపెల్లింగ్ రీజన్ ఈ అమ్మాయి విషయంలో నాకు కనిపించడం లేదు." "లేదు. అది కారణం కాదని నాకు చాలా స్పష్టంగా అనిపిస్తూంది." తనెలా అంత ఫ్రీగా అడగ గలుగుతోందో స్మరన్ కి బోధపడలేదు కానీ ఆ విషయం గురించి తన మేనకోడలు తో మాట్లాడడానికి స్మరన్ కి ఇబ్బందిగానే వుంది. "తన బాడీకి పోస్ట్ మార్టం జరిగిందా?" మరో ప్రశ్న వేసింది మేనక. "జరిగింది. అటువంటిది ఏమీ లేదు." నవ్వాడు స్మరన్. "ఇక్కడ మరొక్క విషయం. ఎక్కువ రోజులు గడిస్తే రేప్ అయినా గ్యాంగ్ రేప్ అయినా బయటపడవు. ప్రూవ్ చెయ్యడం కష్టం.