నిరుపమ - 3

  • 1.5k
  • 729

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర “నీ గురించే ఎదురుచూస్తూ వున్నాను. మాటిచ్చానుగా నువ్వు వచ్చేవరకు నీ ఇల్లు కాపలా కాస్తానని.” నిరంజన్ లేచి నిలబడి నవ్వాడు. “మరింక నాకు సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తాను.” “థాంక్స్ నిరంజన్.” అన్నాక స్మరన్ వైపు తిరిగింది నిర్మల. “కానీ …..” స్మరన్ మొహంలోకి ప్రస్నార్ధకంగా చూస్తూ అంది. “తాను నా క్లోజ్ ఫ్రెండ్ స్మరన్. ఇప్పటివరకు విదేశాల్లో వుండి ఈ మధ్యే స్వదేశానికి వచ్చారు.” రంగనాథ్ అన్నాడు. తన గురించి ఆవిడకి ఎలా పరిచయం చెయ్యాలో ఆల్రెడీ రంగనాథ్ కి చెప్పి వుంచేడు స్మరన్ “నీ క్లోజ్ ఫ్రెండా? ఈ పేరుతో మీకు ఓ క్లోజ్ ఫ్రెండ్ వున్నట్లుగా మీరు నాకు ఎప్పుడూ చెప్పనేలేదు.” నిర్మల భృకుటి ముడిపడింది. “చెప్పే వుంటాను నువ్వు మర్చిపోయి ఉంటావు. అయినా నేను ఒక వ్యక్తిని నా క్లోజ్ ఫ్రెండ్ అని