నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర “సరే అయితే. మీ అమ్మాయి గురించి ఇంకొంచం వివరాలు చెప్పగలరా?” కుర్చీలో ముందుకు వంగి మొచేతులు మధ్యలో వున్న టేబుల్ మీద ఆనుస్తూ అడిగాడు స్మరన్. “ఇరవై ఒక్క సంవత్సరాలు తను చనిపోయే సమయానికి. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతూంది. తనకి ఎవరితోటి ఎటువంటి ప్రేమ వ్యవహారాలు లేవు. తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఇప్పటికే చెప్పాను కదా, తనకి ఆర్ధికంగా గాని, ఆరోగ్యపరంగా గాని ఎటువంటి సమస్యలు లేవు. ఆ రోజు పడుకోవడానికి తన గదిలోకి వెళ్లే ముందు కూడా తను మామూలుగానే వుంది.” ఇంక అంతకన్నా తను చెప్పగలిగింది ఏమి లేదన్నట్లుగా నిట్టూర్చాడు రంగనాథ్. “ఇప్పుడు మీకు కావలిసిందల్లా మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్యే చేసుకుందో మీకు తెలియాలి, అంతే కదా.” రంగనాథ్ ముఖంలోకి సూటిగా చూస్తూ