వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి వీడా, వీడికి ఎందుకు భయపడుతున్నావ్ అంటాడు. శాంతి :- అయ్యో, వాడు మా ఇంట్లో పనోడు, మా ఇంట్లో వాళ్ళకి చెప్తే. వీర ఆ పనోడిని పిలిచి ఇదిగో, ఈ 500 ఉంచుకో. ఇక్కడ చూసింది మాత్రం మీ పెద్దయ్యగారికి కానీ మీ చిన్నయ్య గారికి కానీ చెప్పకు అని అంటాడు. ఆ పనోడు డబ్బులు తీస్కుని కంగారు పడకండి చిన్నమ్మగారు, నేను చూసింది మీ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి చెప్పను అని అంటాడు. ఆ పనోడు అక్కడ్నుండి వెళ్ళిపోయి, ఊరిలో ఉన్న టెలిఫోన్-బూత్ దగ్గరికి వెల్లి ఒక ఫోన్ చేస్తాడు. పనోడు :- అయ్యా, మీరు వెతుకుతున్న అవకాశం మీకు దొరికింది అయ్యా, ఆ శివయ్య కూతురు శాంతి, వీర ప్రేమించుకుంటున్నారు. అటు ఫోన్ నుంచి రంగా శభాష్, మంచి వార్త వింపించావు, ఈ దెబ్బతో ఆ శివయ్య పని, ఈ ధర్మ-వీర ల పని పట్టేయచ్చు. ఒకే దెబ్బకి