అరె ఏమైందీ? - 24

  • 714
  • 348

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ చిదంబరం ఇంటికి వెళ్లేసరికి, తన భార్య, కొడుకు, మల్లిక తో మంగళాచారి ఇంకా సుమారుగా యాభయ్యేళ్ళు వయసున్నావిడ ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. అందరూ అక్కడ హాల్లో వున్న కుర్చీల్లో కూచుని వున్నారు. "వెళ్ళినపని ఏమైందండీ?" శకుంతల ఆతృతగా అడిగింది. "ఏమౌతుంది? అది జరిగిన మర్నాడే మన పిచ్చివెధవ ఆ సర్వేశ్వరానికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయిని తను పెళ్లిచేసుకోవడం అవ్వదని తెగేసి చెప్పేశాట్ట. దానితో ఆ సర్వేశ్వరం తన కూతురి పెళ్లి ఇంకోడితో ఫిక్స్ చేసేసాడు." కోపంగా అన్నాడు చిదంబరం.  "అయినా మా అమ్మాయికి కడుపుచేసిన మీ అబ్బాయికి వేరే అమ్మాయితో ఎలా పెళ్ళిచేస్తారు?" ఆ యాభయ్యేళ్ళు వయసున్నావిడ, మల్లిక తల్లి, చారులత కోపంగా అడిగింది. "మా అబ్బాయి మీ అమ్మాయికి కడుపు చెయ్యడం ఏమిటి?" తన భార్యమొహంలోకి అయోమయంగా చూస్తూ అన్నాడు చిదంబరం. "నాకూ అర్ధం