అరె ఏమైందీ? - 10

  • 1.1k
  • 579

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నిరంజన్ ఇంక మంజీర కలిసి తిరగడం  అనిరుధ్ చూడ్డం అన్నది తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండగా జరిగింది. ఇంటర్మీడియట్ కూడా తామిద్దరూ ఒకే కాలేజ్ లో ఒకే గ్రూప్ ఒకే క్లాస్ రూమ్ లో చదివినా, తామిద్దరి మధ్య ఎలాంటి మాటలు లేకుండా అలాగే జరిగింది ఆ తరువాత కూడా ఎటువంటి మార్పు లేదు. అనిరుధ్ పట్టించుకోకపోయినా తెలిసిన విషయం ఏమిటంటే, నిరంజన్ సర్వేశ్వరం ఫ్రెండ్ కొడుకని, మంజీర కి నిరంజన్ కి అంతకు ముందే పరిచయం ఉందని.   నిరంజన్ తో మంజీర తిరుగుతూన్న వ్యవహారం గమనించాక, అనిరుధ్ కి ఆమె మీద చిరాకు, కోపం కూడా కలిగాయి. ఇంకెవరితోనన్నా సన్నిహితం గా వున్నా అంత ఫీలయ్యేవాడు కాదేమో కానీ, నిరంజన్ తో తనకెలా ఆలా తిరగాలనిపించిందో అనిరుధ్ కి అర్ధం కాలేదు. వాడికి