అరె ఏమైందీ? - 7

  • 1.2k
  • 645

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నిరంజన్ మొహంలోకి చూస్తూ. నేనిప్పుడు మళ్ళీ అయిదు అంకీలు లెక్క పెడతాను. నేను అయిదు అనేసరికి నువ్వు నీ హిప్నోసిస్ లోనుండి బయటకి వస్తావు. అని చెప్పడం మొదలు పెట్టాడు. ఒకటి................నువ్వు నెమ్మదిగా ఈ హిప్నోసిస్ లోనుండి బయటకి వస్తున్నావు. రెండు..........నువ్వు పూర్తిగా ఈ లోకంలోకి వస్తున్నావు. మూడు............నీ మనస్సు, నీ శరీరం పూర్తిగా నీ స్వాధీనం లోకి వస్తున్నాయి. నాలుగు..........నువ్వు కళ్ళు విప్పుతున్నావు. అయిదు..........నువ్వు పూర్తిగా మామూలుగా అయ్యావు. ఇంకా ఆ కుర్చీలో ఉండాల్సిన అవసరం లేదు, బయటకి రా. మంగళాచారి నాలుగు అనగానే కళ్ళు విప్పిన నిరంజన్, అతను అయిదు అనగానే కుర్చీలోనుండి లేచిపోయాడు. ఆ సర్వేశ్వరం భార్యకి, అంటే మా అబ్బాయిని పెళ్లిచేసుకోవాల్సిన అమ్మాయి తల్లికి మనఃస్థిమితం ఉండేది కాదు. ఆ సర్వేశ్వరం ఆవిడని ఎందరో డాక్టర్లకి చూపించాడు కానీ ప్రయోజనం