అరె ఏమైందీ? - 2

  • 1.3k
  • 633

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అది చాలా కాలం కిందట మేము చిన్నపిల్లలుగా వున్నప్పుడు. అదే చిరాకుతో అన్నాడు మనోజ్. తరువాత తనెంత పొగరుగా బిహేవ్ చేసేదో నీకూ తెలుసు. మనవైపు కన్నెత్తి చూసేది కూడా కాదు. అలాంటి అందమైన అమ్మాయికి ఆ పొగరు ఇంకా అందాన్ని పెంచుతుందే కానీ తగ్గించదు. అయినా గులాబీ రేకులంటి ఆ అందాన్ని అనుభవించే అదృష్టం ఆ నింరంజన్ గాడు కొట్టేసాడు. వాడిగురించి ఆలోచిస్తూంటేనే నాకు అసూయగా వుంది.     నాకు మాత్రం చాలా చిరాగ్గా వుంది. మరోసారి కోపంగా అరిచాడు అనిరుధ్. నువ్వసలు నా సమస్యకి ఎమన్నా పరిష్కారం చూపిస్తావా లేదా? నీ సమస్యని మర్చిపోలేదు. అక్కడికే వస్తున్నా. గట్టిగా నిట్టూర్చి కుర్చీలో అడ్జస్ట్ అయ్యాడు మనోజ్. నువ్వు ఆ సర్వేశ్వరాన్ని మరోసారి కలుసుకో. ఇంత మొత్తం అప్పు వారం రోజుల్లో తీర్చడం నీ వల్ల అయ్యే