ధర్మ -వీర - 4

  • 1.7k
  • 753

అది మహా శివరాత్రి, అందరూ ఆ మహా శివుడి దర్శనం చేస్కుని బయట సంతోషంగా జాతర జరుపుకుంటున్నారు. సాయంత్రం 7:00 అవ్వగానే కొంతమంది సారా తీస్కుని పోదల పక్కకు వెళ్లి గ్లాస్ లో పోస్కుని తాగుతు ఉంటారు. హటాత్తుగా వాళ్ళకి పోదల పక్కన ఒక శబ్దం వినిపిస్తుంది, వాళ్లు అటు చూసి భయంతో కేకలు వేస్టు జాతర వైపు నుంచి అరుస్తూ పారిపోతారు. ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దం అయ్యి వాళ్లు ఎందుకు పారిపోతున్నారు అని చూసారు. సడన్ గా ఒక పెద్ద పులి జాతర లో ఉన్న జనం మధ్యలోకి వస్తుంది. అది చూసి జనం అంతా భయంతో ఆరస్తూ పరుగులు తీస్తారు. ఒక చిన్న పాప ఆ జనం పరుగులలో పడి ఒంటరిగా కింద ఏడుస్తూ ఉంటుంది, పులి ఆ పాప ని చూసి ఆ పాప దగ్గరికి మెల్లగా నడుస్తూ వెళ్తుంది. ఆ పాప వాళ్ళ అమ్మ తనని