నులి వెచ్చని వెన్నెల - 20

  • 1.6k
  • 870

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ మళ్ళీ అదే స్వరం. అవే బెదిరింపులు. తను ఏడుస్తూ అడుగుతోంది. బతిమాలుతోంది. కానీ ఆ మనిషి తన మాట వినకుండా వెళ్ళిపోతూంది వేగంగా. తనూ తన వెనకాతల వెళుతూంది అదే వేగంతో. సడన్గా ఎదో బలంగా తగిలింది తన మొహానికి ఈ లోకంలోకి తీసుకొస్తూ. చూస్తే అది కిటికీ రెక్క. మళ్ళీ తనకి అదే డ్రీం వచ్చింది.  మళ్ళీ తను అలాగే ఆ ఆడమనిషిని బతిమాలుతూ అనుసరించండం ప్రారంభించింది. ఈ సారి ఎక్కడవరకూ వెళ్లేదో ఏం చేసేదో తెలీదు ఈ కిటికీ రెక్క తగిలివుండకపోతే. తానెప్పటికీ ఈ పనికిమాలిన డ్రీమ్స్ నుండి ఇంకా హల్యూసీనేషన్స్ నుండి బయటపడి మామూలుగా కాగలదో? హుస్సురని నిట్టూరుస్తూ వెనక్కి తిరిగి వెళ్లిపోదామనుకుంటూండగా ఏవో శబ్దాలు వినిపించాయి ఆ గదిలోనుండి. ఆశ్చర్యపడుతూ ఆ తెరిచివున్న కిటికీలోనుండి లోపలికి చూసింది సమీర. తను అప్పుడు చూస్తూవున్న విషయం అంతగా