Note :- ఈ కథలో ఉన్న పాత్రలు, ఊరు, అన్ని కల్పితం మాత్రమే. ఎవర్ని ఉద్దెశించి రాసింది కాదు. ఈ కాన్సెప్ట్ ని నాకు చెప్పింది నా ఫ్రెండ్ నాని, దాన్ని డెవలప్ చేసి నేను స్టోరీ రాస్తున్న. ఈ నవలలో నా క్రెడిట్ ఎంత ఉందొ నా స్నేహితుడు నాని కి కూడా అంతే క్రెడిట్ ఉంది. కథ ::అది దేవపురి అనే ఊరు, దేశానికి స్వతంత్రం వచ్చి 32 ఏళ్ళు అయినా కూడా ఇంకా ప్రజలు కులం, మతం అనే బేదాలతో వేరుగా ఉన్న రోజులు అవి.ఆ దేవపురి కి రక్షకుడిగా ఆ మహా శివుడు అక్కడ కాల రుద్రుడు గా పూజలు అందుకుంటున్నాడు. ప్రజలు కుల, మతాల బేదాలని వాళ్ళోలోనే కాకుండా ఆ మహా శివుడి ముందు కూడా ఆచరించేవారు. ఒక రోజు పక్క ఊరు జమిందార్ గారి అబ్బాయి వాళ్ళ భార్య, కూతురు ఇంకా వాళ్ళ మనుషులతో 4 కార్స్