నులి వెచ్చని వెన్నెల - 19

  • 1.6k
  • 783

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ ఆ రోజు మల్లికా, మేనకలతో ఆఫీస్ లో తన ఛాంబర్ లో కూచుని మాట్లాడుతూ వుంది సమీర. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోడానికి సెటిల్ అయి ఒక పదినిమిషాల సమయం అయివుంటుంది. అంతలో సమీర సెల్ ఫోన్ మోగింది. ఎవరో అన్నోన్ పెర్సన్ ని సజెస్ట్ చేస్తూంది ట్రూ కాలర్ "హలో" ఫోన్ కాల్ అటెండ్ చేసి అంది సమీర. "ఈజ్ ఇట్ సమీర, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మమూత్ ఇండస్ట్రీస్?" తను అనుకున్నట్టుగానే ఎవరిదో మగ గొంతు. ఇలాంటి ఫోన్ కాల్స్ సమీరకి కొత్త కాదు. "ఆఫ్ కోర్స్, ఎస్." చిరాకు పడుతూ అంది. "నా పేరు మదన్ చౌదరి. నేనొక ప్రైవేట్ డిటెక్టివ్ ని. మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలి." కూచున్న చైర్లో స్ట్రెయిట్ గా అయిపోయింది సమీర. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ తనని కలుసుకుని మాట్లాడాలనుకోవడమేమిటి? ఆల్రెడీ ఒక ప్రైవేట్