నులి వెచ్చని వెన్నెల - 14

  • 1.2k
  • 594

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "ఒకే దెన్. నేను వాటిని నమ్మను." ఒక ఫర్మ్ ఎక్సప్రెషన్ తో అంది సమీర. "దట్స్ నైస్." మల్లిక నవ్వి సమీరని కౌగలించుకుంది. "ఇప్పుడు చెప్పు. అనురాగ్ తో నీ వ్యవహారం ఎంతవరకూ వచ్చింది?" సమీరని విడిచిపెట్టి అడిగింది. "అక్కడే వుంది. డిస్టెన్స్ మామూలుగానే మైంటైన్ చేస్తున్నాడు." రాస్కేల్, తను మీదపడి ముద్దుపెట్టిన తరువాత కూడా వాడిలో ఏ మార్పూలేదు. ఏం జరగనట్టే బిహేవ్ చేస్తున్నాడు. నేనే ఇనీషియేటివ్ తీసుకోవాలి." "టేక్ యువర్ ఓన్ టైం. ఇప్పటివరకూ ఎవర్నీ ప్రేమించకుండా, పెళ్లిచేసుకోకుండా వున్నవాడు, ఇప్పుడు సడన్గా ఎవరినన్నా ప్రేమించి పెళ్లి చేసేసుకుంటాడా ఏం?" మళ్ళీ నవ్వింది మల్లిక. కానీ సమీర టైం తీసుకోదలుచుకోలేదు. వెంటనే యాక్షన్లోకి దిగాలనే నిర్ణయించుకుంది. &&& "నువ్వు మీదపడి ముద్దులు పెట్టేసినంత మాత్రాన నేను నిన్ను ప్రేమించేస్తాననుకుంటున్నావా? నువ్వు నాకు చిన్నపిల్లగా వున్నప్పటినుండి తెలుసు. నన్నెవరో చిన్నపిల్ల