నులి వెచ్చని వెన్నెల - 11

  • 1.3k
  • 666

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "అంకుల్ పోయాక నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావని మాకందరికి తెలుసు. కానీ అంకుల్ లాగే నువ్వూ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్. ఆ కారణానికి ఇంత వీక్ అయ్యి, మేడ మీదనుండి దూకే ప్రయత్నం చేస్తావని నేను అనుకోను. అసలు ఏం జరుగుతోంది? మాకు తెలియనివ్వు." సంజయ్ తీవ్రంగా అడిగాడు. "సమీర ఏమనుకున్నా, ఇప్పుడు అన్నివిషయాలు మీకు తెలియడం మంచిదనే నేను అభిప్రాయం పడుతున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేను వుండగా తనకి ఏ ప్రమాదం జరగనివ్వను." మల్లిక స్వరం ధృడంగా వుంది. "మనమెవ్వరం సమీరకి ప్రమాదం రానివ్వం. ఆ విషయం నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. కానీ అసలు విషయం ఏమిటో ముందు చెప్పు." సంజయ్ చిరాగ్గా అడిగాడు. ఆ తరువాత సమీర గదిలో, మల్లిక అన్నివిషయాలూ వివరించి చెప్తూవుంటే, భయంకనిపించింది నిర్మల ఇంకా సంజయ్ మొహాల్లో. &&& "ఇంత జరుగుతూ