నులి వెచ్చని వెన్నెల - 10

  • 1.6k
  • 783

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "నువ్వూ నీ డాడ్ ఎలా వుండేవారో నాకు బాగా తెలుసు. నీకు నీ చిన్నతనం నుండి మామ్ లేకపోవడం వల్ల అన్నీ ఆయనే అయిపోయారు. నీ ప్రతివిషయం ఆయనతో షేర్ చేసుకునే దానివి, ఎంతో ఇంటిమేట్ గా ఆయనతో వుండేదానివి. అయన అలా చనిపోవడం నీకు తీర్చలేని లోటు." కాస్త ఆగి మళ్ళీ అంది మల్లిక. "అందువల్ల షబ్-కాంషస్ గా నువ్వు, నీ లైఫ్ పార్టనర్ తో ఒక హస్బెండ్ ని తెచ్చుకోవడమే కాదు, డాడ్ లేని లోటుని కూడా తీర్చుకోవాలనుకుంటున్నావు. దట్ మీన్స్, నువ్వు అనురాగ్ లో కేవలం హస్బెండ్ ని మాత్రమే కాదు, డాడ్ ని కూడా చూస్తావు." "నువ్వు మాట్లాడేది చాలా డిస్గస్టింగా వుంది. దయచేసి మరెప్పుడూ ఇలా మాట్లాడకు." షాక్ తో నిండిపోయింది సమీర మనసు అది వినగానే. "బట్ ఐ జస్ట్ వాంట్ టు