నులి వెచ్చని వెన్నెల - 9

  • 1.5k
  • 759

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "నో సందీప్. సమీర మేడం కి ఏ ప్రమాదం రాకూడదు.  తనకి ఏ ప్రమాదం జరగకూడదు. తనకి ముప్పు తలపెట్టాలనుకుంటున్న ఆ ఆడ మనిషి ఎవరు?" కాస్తలో గుర్తుకొచ్చేసింది. తన హస్బెండ్ పేరు సందీప్. అది గుర్తుకు రాగానే సమీర గుండెవేగం పెరిగింది. నీరజ భర్త చనిపోయాడు. చనిపోయిన తన భర్తతో నీరజ ఎలా మాట్లాడుతూంది? అందులోనూ తనగురించి. పూర్తిగా పోయిన భయం మళ్ళీ సమీర గుండెల్లోకి నిండుగా వచ్చి చేరింది. "ఏమిటి ఆ స్త్రీ కి మాడం డాడ్ వల్ల అన్యాయం జరిగిందా? అందుకని అది మాడం ని వదలదా? మరి దానికి నువ్వేమీ చెయ్యలేవా? మాడం మన కుటుంబాన్ని పోషిస్తోంది, ఆ విషయం మర్చిపోకు." "నీరజా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు?" ఇంక ఆగలేక తిన్నగా నీరజ దగ్గరికి వెళ్లి, పక్కన నిలబడి అడిగింది సమీర. "మాడం మీరెప్పుడు