నులి వెచ్చని వెన్నెల - 1

  • 5.4k
  • 2.6k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ డిస్క్లైమర్ ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత యొక్క రచనకి అనువాదం కానీ, అనుకరణ కానీ కాదు. ఈ నవల ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడినది కాదు. అలాగే ఏ సంఘటన తోటి ప్రేరణ పొంది రాయబడినటువంటిది కాదు. ఇందులో వున్న పాత్రలు అన్నీ కూడా పూర్తిగా కల్పితం.  ఒకవేళ ఇందులోని పాత్రలు కానీ, కధ కానీ, మెయిన్ కాన్సెప్ట్ కానీ, నవలలో వేరే ఇంకేదైనా కానీ దేనితోనైనా పోలివున్నాఅది కేవలం కాకతాళీయం (co-incidental) మాత్రమే. రచయిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు &&& అమెరికాలో తమ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్స్ కోసం మూడు నెలలు ప్లాన్ చేసుకుని వచ్చిన సమీర కి తన డాడ్ ఫోన్ చేసి ముఖ్యమైన విషయం మాట్లాడేది వుందని, వెంటనే ఇండియా కి ఇంటికి బయలుదేరి వచ్చేయమనడం ఆశ్చర్యాన్ని కలిగించింది.