పరిచయం

  • 11.2k
  • 2
  • 3.5k

పరిచయం అనేది నాలుగు అక్షరాల పదమే అయినా ఎంతో మందిని కలుపుతున్న ఒక అద్బుతం. ఒక్క చిన్న పరిచయం ఎన్నో సంబంధ బాంధవ్యాలకి మూల కారణమవుతుంది. చిన్న చిన్న పరిచయాలే కొన్ని గొప్ప గొప్ప స్నేహాలు గా, మరికొన్ని ప్రేమగా, ఇంకొన్ని బంధుత్వాలుగా మారితాయి. పరిచయం అనేది ఒకరి నుండి మరొకరికి, వారి నుండి ఇంకొకరికి అలా అలా పెరుగుతూ పోతూ ఎక్కడో ఉన్న ఒకరిని, ఇంకెక్కడో ఉన్న మరొకరిని కలుపుతుంది. అలా ఏర్పడ్డ ఒక చిన్న పరిచయమే నా జీవితానికి ప్రేమని పరిచయం చేసి, తనని నా జీవితంలోకి ఆహ్వానించింది. ఆ చిన్న పరిచయం నా జీవితంలో చేసిన మార్పులని నేను మీతో పంచుకోబోతున్నాను.నేను పీ.జీ చదువుతున్న రోజులవి. అప్పట్లో నాకు స్నేహం అన్నా స్నేహితులు అన్నా చాలా ఇష్టం. నాకు స్నేహితులు కూడా ఎక్కువే. అమ్మాయి, అబ్బాయి అని ఏ తేడా కూడా లేకుండా స్నేహం చేసేవాడిని. ఎవరికి