నిజం - 30

  • 4k
  • 1.6k

వాళ్ల దగ్గరికి వస్తూ కనిపించిన గంగ , సాగర్ లను చూస్తూ అచ్చం పార్వతీ, పరమేశ్వరులను చూస్తున్నట్టు వుంది అని మళ్లీ విజ్జి వంక చూసి అయ్యో ఏదో నోట్లోంచి అలా వచ్చేసింది ఏమీ అనుకోకండి అమ్మా అన్నాడు భద్రం. విజ్జీ: పర్లేదు బాబాయ్ మాకు కూడా అలానే అనిపించింది కానీ మేము పైకి అనలేదు మీరు అన్నారు అంతే. భద్రం : అంటే మన గంగమ్మ, ఇంకా సాగర్ బాబూ త్వరలో అనిఅనే లోపు విజ్జి మాట్లాడుతూ అవును బాబాయ్ మీరు అనుకున్నది నిజమే కానీ అప్పుడే ఎవరితోను అనకండి బాబాయ్ ముందు మన గంగ చదువు పూర్తి కావాలి అంది . భద్రం సరే అన్నట్టు నవ్వుతూ తల వూపాడు. అక్కడకు వచ్చిన సాగర్ విజయ్ ని తట్టి ఏంట్రా అలా ఆలోచిస్తూ వున్నావు అన్నాడు . సాగర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన విజయ్ ఏం లేదురా