తొలి చినుకు...

  • 6.3k
  • 1
  • 1.9k

తొలి చినుకు .....పచ్చ పచ్చ చెట్లు కోక వోలె చేసి అలా నవయ్యరాలతో పడుకొని ఉన్న ధరణి ని వయసులో ఉన్న వరనుడి చూపు తన మీద పడి ఆ మోహకళ్ళలో నుంచి వచ్చే సెగలు భూ ఉపరి తలాన్ని తాకినప్పుడు, ఒంటరిగా ఇంట్లో నిదురిస్తున్న కన్నె పిల్ల కి చలి లో కూడా చెమటలు పట్టి, తన ఒక కాలి బొటన వేలు మీద రెండో కాలి బొటన వ్రేలు ముగ్గు వేస్తుంది...అప్పుడు వినిపించే పట్టీల శబ్ధం లో ఉన్న తాపం, భూమికి తగిలినప్పుడు ఆవిరిలా ఆకాశానికి లేస్తుంది. అప్పటి వరకు నీలంగా ఉన్న ఆకాశానికి ఆవిరి భుతాపన్ని అంత మూసుకొని మోహస్వర మేఘాలను తాకుతుంది.ఆ క్షణం లో ఆకాశం గుండె వేగంగా కొట్టుకుని ఉరుములా భూమిని చేరుతుంది. శోభన గదిలో ద్వీపాలు అర్పేసినట్టు మేఘాలు సూర్యుణ్ణి ఆర్పేసి, నగ్నం గా ఉన్న దేహం మీద కప్పిన పువ్వుల దుప్పటి