నిజం - 21

  • 3.5k
  • 1.5k

రాఘవులు తనకు అప్ప చెప్పిన పనిలో బిజీ గా ఉన్నాడు , మరో వైపు చంద్రం మచిలీపట్నం కి బయలుదేరాడు , చైర్ లో కూర్చుని వున్న విజయ్ సాగర్ వైపు తిరిగి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రా , ఆ పీటర్ చంపటానికి డబ్బు తీసుకుంటే డైరెక్ట్ గా వాడే ప్లాన్ చేసి పిల్లాడిని చంపకుండా ఎందుకు మధ్యలో ఈ శరభయ్య తో మర్డర్ చేయించాడు అని ఆలోచిస్తూ అన్నాడు సాగర్ తో , నేరం శరభయ్య మీద పడ్డాక వాళ్ల గురించి బయటకు వచ్చే ఛాన్స్ ఉండదని కావాలనే ప్లాన్ చేసి ఉండ వచ్చు అన్నాడు సాగర్ , Any way ముందు ఆ రామారావు గారికి శత్రువులు ఎవరున్నారో ముందు కనుక్కోవాలి , వాళ్ల ఇంటికి వెళ్ళి అందరితో ఒక సారి మాట్లాడాలి అని చైర్ లోంచి లేచాడు విజయ్. నేను కూడా నీతో