నిజం - 15

  • 3.9k
  • 1.6k

Next day.... నీ దగ్గరకు వచ్చిన ప్రతి సారీ బుడ బుక్కల వాడి వేషం లోనే వచ్చేవాడా అడిగాడు విజయ్ , లేదు ఒకసారి బుడ బుక్కలివాడిలాగా ఒకసారి కోయ దొర లాగా , మరోసారి ఇంటిలో ఎలకల్ని పోగొడతా అని అరుచుకుంటూ , మరోసారి పిల్లలికి బుడగలు అమ్మేవాడిలా ఇలా రక రకాలుగా వచ్చేవాడు , అందుకే వాడు ప్రతి నెల వచ్చే సంగతి ఎవరికీ తెలీదు అన్నాడు శరభయ్య , మరి పిల్లాడు తప్పిపోయిన రోజు వూరికి కొత్త వాళ్ళు ఎవరూ రాలేదని చెప్తున్నారు కదా అందరూ అడిగాడు విజయ్ , కాసేపు చెప్పాలా వద్దా అనుకుంటూ తటపటాయించి sir నేను కావాలని ఏది చేయలేదు అని విజయ్ కాళ్ల మీద పడి ఏడవడం మొదలు పెట్టాడు శరభయ్య , చూడు చేయ్యాల్సినది అంతా చేసేసి ఇప్పుడు నాకు ఏ పాపం తెలీదు అంటే ఎవరూ నమ్మరు ,