నిజం - 13

  • 4.1k
  • 1.6k

స్టేషన్ కి వెళ్ళగానే విజయ్ శరభయ్య దగ్గరికి వెళ్ళాడు , ఒక కుర్రాడు వచ్చి sir టీ అని విజయ్ కి టీ ఇచ్చేసి వెళ్ళాడు , చెప్పు శరభయ్య తరువాత మరిడయ్య ని ఎప్పుడు కలిసావు అని అడిగాడు విజయ్ , ఈలోపు బయటి నుండి గోల గోల గా అరుపులు వినిపించాయి , ఒక కానిస్టేబుల్ విజయ్ దగ్గరకు వచ్చి sir వూరి జనం స్టేషన్ ముందు నిలబడి గోల చేస్తున్నారు అన్నాడు , ఉన్న సమస్య చాలదన్నట్టు ఈ కొత్త సమస్య ఏంట్రా బాబు అనుకుని , రాఘవులు గారు వాళ్ళ గోల ఏంటో చూడండి అన్నాడు విసుగ్గా విజయ్ , ఈ శరభయ్య బాబు ను చంపడానికి చూసాడు అని తెలిసినట్టుంది అందుకే వచ్చినట్టున్నారు నేను వెళ్లి మాట్లాడతాను , అని చెప్పి బయటకు వెళ్లాడు రాఘవులు , విజయ్ శరభయ్య ను చూసి చూసావుగా