నిజం - 3

  • 4.7k
  • 2.4k

కళ్ళు తెరిచేసరికి చుట్టూ చీకటి దూరంగా మనవడి రూపం లీలగా కనిపించింది , కుర్చీలో నుండి లేచి నిదానంగా తన మనవడు కనిపించిన వైపు నడుస్తూ వెళ్ళాడు, తాతయ్యా హెల్ప్ తాతయ్య హెల్ప్ అంటూ మనవడు అరుస్తూ కనిపిస్తున్నాడు , బాబు వస్తున్నా అంటూ హడావుడిగా పరిగెత్తాడు రామారావు, రామారావు అరుపులకు లేచిన వీరయ్య రామారావు ని చూసి కంగారుగా వెళ్లి అయ్యా ,అయ్యా అంటూ రామారావు ని పట్టుకున్నాడు , రామారావు వీరయ్య ని చూసి వీరయ్యా ,వీరయ్యా అడుగో సంపత్ బాబు, వెలిపోతున్నడు, వాడు అన్నం తినకుండా మారాం చేసి పరిగెడుతున్న ప్రతి సారీ నువ్వే కదరా పట్టుకుంటావు వెళ్లి వాడిని తీసుకురా అన్నాడు కంగారుగా , అయ్యా అక్కడ ఎవరూ లేరు అయ్యా ,మీరు బాబు గురించే ఆలోచస్తున్నారు అందుకే అలా అనిపిస్తుంది ,రండయ్యా అంటూ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టాడు వీరయ్య. బయట నుండి వచ్చిన అలికిడికి