నిజం - 1

  • 11.6k
  • 1
  • 5.2k

రాయవరం ఒక ప్రశాంతమైన పల్లెటూరు , 20km దూరంలో అందమైన సముద్రం ,ఊరిలో పచ్చని పొలాలు ,కుల మత బేధాలు లేకుండా అందరూ కలసి, మెలసి ఉంటారు. ఆ ఊరి సర్పంచ్ రామారావు, ఆయన అంటే ఆ ఊరిలో అందరికీ చాలా గౌరవం ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా సాయం చేసేది రామారావు గారే. రామారావు గారి భార్య పేరు శాంతమ్మ పేరుకు తగ్గట్టే శాంతమూర్తి . కొడుకు పేరు మోహన్ ,కోడలు పేరు స్వప్న .మోహన్ ,స్వప్న దంపతులకు ఒక బాబు పేరు సంపత్ రెండవ తరగతి చదువుతున్నాడు. రామారావు ,శాంతమ్మ గార్ల రెండవ సంతానం గంగ. రోజూ సాయంత్రం సందడిగా ఉండే ఆ ఇల్లు ఈరోజు నిశ్శబ్దంగా ఉంది, స్వప్న బయట వరండాలో నుంచొని రోడ్డు వైపు చూస్తూ ఉంది తన కొడుకు సంపత్ కోసం , ఏమ్మా