మా ఊరు (పల్లెటూరు)

  • 6.3k
  • 2.3k

మా ఊరు V. బొంతిరాళ్ల అని పిలవబడే అందమైన పల్లెటూరు. గూగుల్ మ్యాప్ లో కూడా చోటు లేని అటువంటి చిన్న ఊరు.అది సెప్టెంబరు మాసం. ఉదయం నుంచి ఎన్నో దేశాలు తిరిగి అందరి కాలక్షేమాలు చూసి, మ వూరి కల్లేకొండ వెనకాల విశ్రాంతి తిస్కోటానికి పచ్చటి పైర్ల మధ్యలో ఎర్రటి బంతి వోలో మెల్లి మెళ్ళి గా గూటిలో కి జారుతున్నట్టు కల్లేకోండ వెనకాలకు జారుతున్నాడు . అప్పుడే బడి నుంచి వచ్చిన చిన్న పిల్లలు బడి సంచులు గోడ మీద వేసి పరుగెత్తుకుంటూ వచ్చి ఊరి లోనికి వచ్చిన సర్కస్ దగ్గర గుము గుడతున్నారు. కొందరు పిల్లలు ఆకలితో, ఇంట్లో ఉన్న తినుబండారాలు గబ గబ నోటిలో వేసుకొని పరుగెత్తుకు వస్తున్నారు. సైకిల్ వేసుకొని నువ్వు ఫస్ట్ హా నేను ఫస్ట్ హా అన్నట్టు పరుగెడ్తున్నరు . దొడ్ల లో పాక లలో కట్టేసిన లేగ దూడలు.. వారి