అనుకోని ఒక రాత్రి

  • 80.1k
  • 2
  • 27.9k

నా పేరు ఆర్య నేను ఒక రోజు నా స్నేహితుడు నీ కలవడానికి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది . ఆ వెంకటాపురం గ్రామానికి వెళ్లాలంటే  5  కిలోమీటర్లు మేరా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటాలని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలను అనుసరించి మెల్లగా నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ దట్టమైన అడవిలోకి ప్రయాణించాను. ఆ రోజు అమావాస్య కావడంతో అడవి అంతా కటిక చీకటిగా మారింది. అ కటిక చీకటిలో కారులో ఇళయరాజా పాటలు వింటూ సంతోషంగా వెళుతున్నాను.  అలా అడివి మధ్యలో వచ్చేసరికి ఒక్కసారిగా కారు హెడ్ లైట్ లో వెలుతురు తగ్గిపోయింది . నేను వెళ్తున్న దారి నాకు అసలు కనిపించడం లేదు. మెల్ల మెల్లగా కార్ హెడ్లైట్లో వెలుతురు తగ్గి ఒక్కసారిగా కారు ఆగిపోయింది.కారుని మళ్లీ స్టార్ట్ చేశాను కానీ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వలేదు.